23న మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపు: జిల్లా ఆయుష్ ఇంచార్జి డాక్టర్ కె రాఘవేందర్ రావు
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): 11వ ఆయుర్వేద దినోత్సవం 2026 వేడుకలలో భాగముగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో 23న మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా ఆయుష్ ఇంచార్జి డాక్టర్ కె రాఘవేందర్ రావు(District AYUSH In-charge Dr. Raghavender Rao) తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా మెడికల్ క్యాంపు ప్రభుత్వ ఆయుష్ ఇంటిగ్రేటెడ్ 50 పడకల ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ క్యాంపులో ముఖ్యంగా ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, ఉదర సంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులు, కిడ్నీ సంబంధిత సమస్యలు, పైల్స్ తదితర ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్య విధానంలో అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స ఆరోగ్య సలహాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.