తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు

29-10-2026 | 05:49pm

నిర్మల్ అక్టోబర్ 29 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సందీప్(Mission Bhagiratha Executive Engineer Sandeep) తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఈ వేసవిలో మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని అన్ని ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.

గ్రామాల్లో నేటి పొదుపు పై ప్రజల్లో ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మిషన్ భగీరథకు ఉపయోగించే పైప్ లీకేజీల నియంత్రణ, గ్రామాల్లో నల్ల నీరు వృధా పోకుండా నల్లాల ఫిటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి అక్కడ మిషన్ భగీరథ ద్వారా ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని మిషన్ భగీరథ ఉద్యోగులు సిబ్బంది 24 గంటలు అత్యవసర సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు