సర్దార్ నాయకత్వ లక్షణాలు నేటి తరానికి ఆదర్శం
సింగరేణి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి
జీఎం కార్యాలయంలో ఘనంగా వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) దూరదృష్టి, ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు నేటి తరానికి ఆదర్శం అని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి(Singareni Bhupalpally Area General Manager Enugu Rajeshwar Reddy) అన్నారు. భారతదేశ ఉక్కు మనిషి, దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు(Sardar Vallabhbhai Patel Birth Anniversary) జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించగా జీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ... దేశ స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలోని వివిధ సంస్థానాలను ఏకం చేసి, దేశ ఐక్యతకు పటిష్టమైన పునాదులు వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. భారతదేశ సమైక్యత, సమగ్రతను కాపాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చిరస్మరణీయమని, విభిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతీయులందరిని ఐక్యంగా ఉంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
సింగరేణి సంస్థ అభివృద్ధిలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమష్టి కృషితో ముందుకు సాగుతూ సంస్థ ప్రగతికి తోడ్పడాలని జీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ డీజీఎం రాజేశ్వర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, ఎన్విరాన్మెంట్ అధికారి టి పోషమల్లు, ఎరియా సర్వే అధికారి శైలేంద్ర కుమార్, ఐటిప సీనియర్ ప్రోగ్రామర్ శంకర్, ఐఎన్టీయూసీ నాయకులు హుస్సేన్, సీఎంఓఐఏ అద్యక్షులు నజీర్, జీఎం కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.