పండుగ సాయన్న జయంతి కార్యక్రమానికి ఆహ్వానం
భూపాలపల్లి,(విజయక్రాంతి): పండుగ సాయన్న జయంతి(Panduga Sayanna Jayanti)ని తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం(Telangana government) అధికారికంగా నిర్వహిస్తోందని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా అక్టోబర్ 22న గురువారం ఉదయం 10 గంటలకు భూపాలపల్లి కలెక్టర్ సమావేశ మందిరంలో జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పండుగ సాయన్న స్ఫూర్తిని స్మరించుకునేందుకు నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ కుల సంఘాల నాయకులు, పెద్దలు, అధికారులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం, మంత్రి వాకిటి శ్రీహరి, బుర్ర జ్ఞానేశ్వర్, బండా ప్రకాశ్, కాసాని జ్ఞానేశ్వర్, ఎంపీ ఈటల రాజేందర్, నీలం మధు తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.