హోంగార్డు కూతురుకు కాంస్య పతకం

06-11-2026 | 08:22pm

షూటింగ్లో పథకం సాధించిన విద్యార్థి

కామారెడ్డి, నవంబర్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న పెరమ్ స్వామి(హెచ్ జి నెంబర్ 530 ) చిన్న కూతురు పేరం అక్షిత  షూటింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయికి అర్హత సాధించింది. 70వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌(State SGFI Shooting Championship)లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం  బ్రౌన్జ్ మెడల్ సాధించింది. ఈ విజయంతో జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.

ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అక్షిత సాధించిన ఈ విజయం పట్ల కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారులు, సదాశివనగర్ పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్. సదాశివ నగర్ పోలీస్ సిబ్బంది ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు