దుర్గామాత వద్ద అన్న ప్రసాదం
19-10-2026 | 05:46pm
తాడ్వాయి,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో సోమవారం దుర్గామాత వద్ద అన్న ప్రసాదం వితరణ చేశారు. గ్రామంలోని ఆదర్శ యూత్ అసోసియేషన్(Adarsha Youth Association) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు,యువకులు పాల్గొన్నారు.