ఎస్పీ కార్యాలయంలో ఆయుధాల పూజ
నిర్మల్,(విజయక్రాంతి): దసరా నవరాత్రుల(Dasara Navaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధపూజ(Ayudha Puja) కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల(SP Dr. G. Janaki Sharmila), పాల్గొని పోలీస్ ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్ వాహనాలకు వాహనపూజ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, దసరా నవరాత్రులలో భాగంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఆయుధపూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.
పోలీస్ శాఖలో ఆయుధాలు, వాహనాలు విధి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు దసరా, నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాటు అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.