ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాలకు భూమి పూజ

19-10-2026 | 06:33pm

- రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు

మేడ్చల్,(విజయక్రాంతి): దుండిగల్ మున్సిపాలిటీ(Dundigal Municipality) పరిధిలోని డిపోచంపల్లిలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా 9 ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల(Integrated Government School)కు ప్రభుత్వ మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్(Special Chief Secretary JS Ranjan) భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను బీరువా చేయడంతో పాటు వారికి విస్తృత అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టిన రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా 9 ప్రతినిధులను అభినందించారు.

అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ ఈ పాఠశాల పరిసర ప్రాంతాల్లోని పిల్లలు, వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్నిత గడువులోగా పూర్తి చేసేందుకు అందరూ పరస్పరం సహకరించుకోవలసిన అవసరం ఉందన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా 9 చైర్మన్ అనిరుధ్ సోంపల్లి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న దాదాపు 7వేల కుటుంబాలు నివసిస్తున్నాయని, ఇందులో చాలామంది పిల్లలు ఉన్నత విద్యాసంస్థలో అభ్యసించడానికి దూరప్రాంతాలకు వెళ్తున్నారన్నారు.

వీరికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇమేజ్ హాస్పిటల్ చైర్మన్ సివి రావు, ప్రెస్ స్టిల్స్ ఫ్యాబ్రికేషన్స్ డైరెక్టర్ వనజ సోంపల్లి, అభిషేక్ అగర్వాల్, బి లోకేశ్వర్ రెడ్డి, కౌశిక్ , నిర్మల్ ఉప్పుగుండ్ల, చైతన్య చిన్నం, భరత వర్మ ఉద్ధరాజు, పట్టాభి రామయ్య, గౌరవ్ అగర్వాల్, ఉమాంగ్ డాగా, తాడి సందీప్ రెడ్డి, సుదాన్సు షా, దిలీప్ అరవింద్, ఆశిష్ శాంతాలియా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు