మెగా రక్తదాన శిబిరం
సదాశివనగర్,(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Police Martyrs Commemoration Day) సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాన సందేశాన్ని చాటారు. రక్తదానం చేయండి – ప్రాణాలను కాపాడండి ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి, ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతలుగా నిలవాలని ఐఎస్ఆర్డి స్వచ్ఛంద సంస్థ(ISRD voluntaryorganization) కార్యదర్శి అమృత రాజేందర్ కోరారు.ఈ సందర్బంగా రక్త దానం చేశారు. మీ ఒక్క యూనిట్ రక్తం మరొకరికి కొత్త జీవితాన్ని అందించగలదన్నారు.