మండలంలో గుప్పుమన్న గంజాయి
400 మొక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) గాంధారి మండల కేంద్రంలో గంజాయి గుప్పుమంది. వివరాల్లోకి వెళ్తే గాంధారి మండల కేంద్రంలోని ఓ రైతు వ్యవసాయ భూమి(agricultural land)లో మండలంలోని నేరళ్ తండాకు చెందిన ముగ్గురు కౌలుదారులు పత్తి పంట(cotton crop)లో అంతరంగ గంజాయి మొక్కలు(Cannabis plants) పెంచుతున్నారన్న పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో స్థానిక పోలీసులు దాడి చేయగా పత్తి పంటలో సాగు చేస్తున్న 400 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై ఎన్డీపిఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు వారు తెలిపారు. ఎవరైనా గంజాయి సాగు చేసిన, రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.