ఘనంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం
22-10-2026 | 08:10pm
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) పిట్ల మండలంలోని చిల్లరికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మి కాంతారావు(MLA Thota Laxmikantha Rao) ఆధ్వర్యంలో గురువారం నాడు పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్లో అధ్యక్షులుగా ధర్మారెడ్డి రామ్ రెడ్డి, డైరెక్టర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, పిట్లం సర్పంచ్ కుమ్మరి శేఖర్, నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.