దరఖాస్తులు స్వీకరణ

03-10-2026 | 06:35pm

జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి 

మహబూబ్‌నగర్ : జిల్లాలోని 24 పీఎం శ్రీ సెకండరీ పాఠశాలల్లో(PM SHRI Secondary School) ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మెరుగైన విద్య(Better Education), సహాయక, సమ్మిళిత విద్యా సేవలు అందించేందుకు గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్లను(Guest Special Educators) తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి(District Educational Officer Vijayakumari) తెలిపారు.

సమగ్ర శిక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు నవంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు ఐదు నెలల పాటు ప్రతి పాఠశాలకు ఒకరి చొప్పున నియమించనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక విద్యలో నిర్దేశిత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. బీఎడ్‌ ప్రత్యేక విద్య, బీఎడ్‌ జనరల్, ప్రత్యేక విద్య డిప్లొమా లేదా పీజీ డిప్లొమా తదితర అర్హతలు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు.

స్థానిక అభ్యర్థులకు గ్రామం, మండలం, జిల్లా ప్రాతిపదికన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.16,500 గౌరవ వేతనం చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 3 నుంచి 8వ తేదీ వరకు సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు