పంచాయతీ కార్మికుడిగా మారిన ప్రధానోపాధ్యాయుడు
చండ్రుగొండ,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉపాధ్యాయుడే పంచాయతీ కార్మికుడిగా మారి తానే స్వయంగా పాఠశాల ఆవరణలో కలుపు మందు పిచికారి చేసిన సంఘటన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం, అంబేద్కర్కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..... చండ్రుగొండ మండల కేంద్రానికి శివారులోని అంబేద్కర్కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(Government Primary School)లో పిచ్చి మొక్కలు పెరిగి, పాఠశాల గదుల్లోకి, ఆవరణలోకి పామలు, తేళ్లు వస్తున్నాయని, చెత్త నివారణ చేపట్టాలని పలుమార్లు ఆ పాఠశాల హెచ్ఎం ఎన్ వెంకటేశ్వరరావు పలుమార్లు పంచాయతీ అధికారులకు, సిబ్బంది తెలియజేశాడు.
గ్రామస్తులు, తల్లిదండ్రులు సైతం పంచాయతీ సిబ్బందికి తెలియజేసిన పట్టించుకోకపోవడం వల్ల ఇటీవల పాములు వస్తుండటంతో చేసేదేమీలేక ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే కలుపునివారణ కోసం పంపును తీసుకొచ్చి, కలుపునివారణ మందును స్వయంగా పిచికారి చేశాడు. ఈ విషయం కాస్త కొందరు యువకులు సోషల్మీడియాలో వీడియోతీసి పెట్టడంతో వైరల్ గా మారింది. పంచాయతీ వారు అసలు పట్టించుకోకపోవడం వల్లనే ఉపాద్యాయుడే గొడవులు వద్దని, చేసేదేమీలేక కలుపునివారణ పనులు స్వయంగా చేస్తున్నారని, పాఠశాల పంతులా ? లేదా ? పారిశుద్ద కార్మికుడా...? అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ హెచ్ఎంకు అభినందనలు పలువురు తెలియజేయగా, పంచాయతీకి చెందిన ప్రజాప్రతినిధి మాత్రం బెదిరింపులకు పాల్పడిన్నట్లు విశ్వసనీయ సమాచారం.