రామప్ప శిల్పవైభవానికి విదేశీ ప్రతినిధుల ప్రశంసలు

03-10-2026 | 06:38pm

వెంకటాపూర్,(విజయక్రాంతి): ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని(Ramappa Temp) 18 దేశాలకు చెందిన 28 మంది విదేశీ అధికారులు(Foreign Delegates), పాత్రికేయుల బృందం శనివారం సందర్శించింది. కాకతీయుల నిర్మాణ నైపుణ్యం, శిల్పుల కళా ప్రతిభ అద్భుతంగా ఉందని వారు ప్రశంసించారు. రామప్ప ఆలయ చరిత్ర, శిల్పకళ, నిర్మాణ విశిష్టతలను పర్యాటక గైడ్ విజయ్ కుమార్(Tour Guide Vijay Kumar) వారికి వివరించారు.

ఇసుక పునాది, తేలికపాటి ఇటుకల వినియోగం, సున్నితమైన శిల్పాలు, నాట్య భంగిమలను ప్రతినిధులు ఆసక్తిగా పరిశీలించారు. కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానం, భారతీయ సంస్కృతి వైభవం తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి రఫిక్, పర్యాటక సమన్వయ అధికారి ధర్మా నాయక్, కుసుమ సూర్యకిరణ్, సంబంధిత అధికారులు, టూరిస్ట్ పోలీసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు