పక్షుల కిలకిల రావాల గుర్తింపులో బాలికల ప్రతిభ

24-09-2026 | 07:54pm

తాడ్వాయి,(విజయక్రాంతి): పక్షుల కిలకిల రావాల గుర్తింపులో  తాడువాయి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఏఐ ఆధారిత పక్షుల గుర్తింపు పరికరం ఈకో సెన్స్ బర్డ్ పరికరాన్ని(Eco Science Bird device) తయారు చేశారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) చొరువుతో విద్యార్థులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన నిర్వహించి గుర్తింపు పొందారు. పర్యావరణ పరిరక్షణ(Environmental protection) లక్ష్యంగా ప్రత్యేక ప్రోత్సాహంఅందించాలన్నారు.

పక్షుల కూతల ఆధారంగానే పక్షి జాతులను గుర్తించే ఏకో సెన్స్ పరికరాన్ని తయారు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా అత్యాధునిక  సాంకేతికతను అందిపుచ్చుకోవాలనే కలెక్టర్ చొరవ విద్యార్థులకు ప్రోత్సాన్నిచ్చిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సురేఖ, ఉపాధ్యాయులు స్రవంతి, అనూష ఉపాధ్యాయ బృందం అభినందించారు.

మరిన్ని వార్తలు