శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు...
తాడ్వాయి,నవంబర్,24( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి శివారులోని సిద్దేశ్వర స్వామి ఆలయంలో (Siddheshwara Swamy Temple) మాజీ ఎమ్మెల్యే సురేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఆయన ముందుగా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం బ్రహ్మాజీ వాడి శివారులోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆలయం ఎంతో పవిత్రమైందని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముదాం నరసింహులు, కపిల్ రెడ్డి, పులగం సాయి రెడ్డి,సంజీవులు, రాజు గౌడ్,ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.