గ్రామాల్లో భద్రతపై సిబ్బందికి పలు సూచనలు

24-11-2026 | 06:58pm

పోలీసు రికార్డులను పరిశీలించిన సిపి రష్మీ పెరుమాళ్ 

కొండపాక, నవంబర్ 24 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్(Police Commissioner Rashmi Perumal) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరిశీలించి, స్టేషన్ నిర్వహణ, శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. గ్రామాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాలకృష్ణ సిపి రష్మీ పెరుమాళ్ కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ శ్రీనివాస్, ఎస్ ఐ బాలకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు