జేపీ నడ్డా తెలంగాణ టూర్ వాయిదా.. కారణం ఇదే
హైదరాబాద్: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా(BJP Senior Leader JP Nadda) తెలంగాణ పర్యటన వాయిదా పడింది. నవంబర్ 25న సిద్దిపేటలో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్ర(BJP Maha Padayatra)లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే కేంద్ర కేబినెట్ సమావేశం నేపథ్యంలో పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. సిద్దిపేట(Siddipet)లో జరిగే మహా పాదయాత్ర కార్యక్రమం కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేపట్టింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Medak MP Raghunandan Rao) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు. తాజా పరిణామంతో పాదయాత్రలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. నడ్డా పర్యటనకు సంబంధించి కొత్త తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.