కృష్ణాజివాడిలో రైతు ఆత్మహత్య
అప్పుల బాధలు భరించలేక బలవన్మరణం...
తాడ్వాయి,అక్టోబర్, 23( విజయక్రాంతి): అప్పుల బాధలు భరించలేక ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య(Farmer commits suicide by hanging) చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో(Krishnajiwadi Village) శుక్రవారం అదే గ్రామానికి చెందిన దాసరి రమేష్(Dasari Ramesh) (40) అనే వ్యక్తి తన సొంత చేనులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... రమేష్ తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అప్పులు పెరిగిపోయి గత కొన్ని నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయన అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు.మృతుడికి భార్య బాల్ లక్ష్మి,ఇద్దరు కుమారులు ఉన్నారు.ఈ విషయమై తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు