ఏఐవైఎఫ్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నిక

11-09-2026 | 06:49pm

యాదగిరిగుట్ట,సెప్టెంబర్ 11(విజయ క్రాంతి): యాదగిరిగుట్ట లో జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం న్యూ గుండ్లపల్లికి చెందిన పేరబోయిన మహేందర్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా(ఉప ప్రధాన కార్యదర్శి)ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో పనిచేసి విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యల పైన ఉద్యమాలు నిర్వహించారు.తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలు కార్యక్రమాలు నిర్వహించారు,2018 సంవత్సరంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ గా ఎన్నికై యువజన, నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు నిర్వహించారు,2023 హైదరాబాద్ లో జరిగిన 2వ మహాసభలో రాష్ట్ర కోశాధికారిగా ఎన్నిక కావడం జరిగింది, యాదగిరిగుట్టలో ఈనెల   8, 9, 10 తేదీలలో  జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా (ఉప ప్రధాన కార్యదర్శి) ఎన్నిక కావడం జరిగింది.

మరిన్ని వార్తలు