పశ్చిమ బెంగాల్ పేరు మారబోతోందా?

23-11-2026 | 05:19pm

పశ్చిమ బెంగాల్ పేరు మారబోతోందా? దశాబ్దాలుగా కొనసాగుతున్న పేరు మార్పు(Name Change) చర్చకు మరోసారి తెరలేచింది. రాష్ట్రం పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చేందుకు బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్(Cabinet) ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిసెంబర్ 9న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో తీర్మానం(Resolution) ఆమోదం పొందిన తర్వాత తదుపరి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

డిసెంబర్ 4 నుంచి 14 వరకు జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ అంశం చర్చకు రానుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందితేనే పేరు మార్పు ప్రక్రియ తదుపరి దశకు చేరుతుంది. అనంతరం కేంద్రం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం పేరు మార్పు ప్రతిపాదనకు మాత్రమే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారికంగా పేరు మారలేదు.

ఇకపై వెస్ట్ బెంగాల్ పేరు పశ్చిమ బంగా కానుందా? డిసెంబర్ 9న అసెంబ్లీలో ఏం జరగబోతోంది? కేంద్రం(Central Government) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని వార్తలు