రెచ్చిపోతున్న అక్రమ వెంచర్ల మాఫియా ఆగడాలు...!
- ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు..
- కొనుగోలుదారుల భవిష్యత్తుతో చెలగాటం...
- కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు బాన్సువాడ డివిజన్లో యథేచ్ఛగా వెంచర్లు...
- కన్నెత్తి చూడని సంబంధిత శాఖ అధికారులు...
బాన్సువాడ, అక్టోబర్ 11 (విజయ క్రాంతి): ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. వెంచర్గా మార్చేస్తున్నారా? నిబంధనలకు నీళ్లొదిలి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు(Real estate businesses) సాగుతున్నాయ న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతు లు ఉన్నాయా? లేఅవుట్ నిబంధనలు పాటిస్తున్నారా? మౌలిక వసతులు కల్పిస్తున్నా రా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సంబంధిత శాఖల పర్యవేక్షణపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు బాన్సువాడ డివిజన్లో పలు ప్రాం తాల్లో వెంచర్ల ఏర్పాటు తీరుపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణం గా లేఅవుట్లు అభివృద్ధి చేయాల్సి ఉండగా, కొన్ని చోట్ల నిబంధనల అమలుపై సందేహా లు వ్యక్తమవుతున్నాయి.
రహదారులు, డ్రైనే జీ, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం జరిగితే భవిష్యత్తులో స్థ లాలు కొనుగోలు చేసిన ప్రజలు ఇబ్బందు లు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.ప్రజాధనం, ప్రజల కష్టార్జితం ప్రమాదంలో పడకుండా.. అక్రమ లేఅవుట్లపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల అమలును పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
వ్యవసాయ భూములు వెంచర్లుగా ఏర్పాటు...
బాన్సువాడ పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను రియ ల్ వ్యాపారులు ధనార్జనయ ధ్యేయంగా ప్రభుత్వానిబంధనలను తుంగలో తొక్కి వ్యవసాయ భూములను వెంచర్లుగా ఏర్పా టు చేస్తూ అమాయక ప్రజలను దండుకుంటున్న సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రభుత్వాన్నిబంధనలు ప్రకారం రిజిస్ట్రేషన్ కాకపోవడం మున్సిపల్ అనుమతులు మంజూరు కాక నానా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏ ర్పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవసాయ భూములను నాలా అనుమతులు లేకుండా మున్సిపల్ అ నుమతి పొందకపోవడం 10% భూమిని వదలక పోవడం లాంటి ఎన్నో అక్రమాలు చేస్తూ రియల్ వ్యాపారులు హిస్టారికల్ వెం చర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వెంచర్లపై ఉన్నత అధికారులు విచారణ చేపట్టి అ క్రమ వెంచర్లపై కొరడా ఝళిపించాలని పట్టణ ప్రజల కోరుతున్నారు.
నిబంధనలకు తూట్లు...
లేఅవుట్లు వేస్తున్న వ్యాపా రులు నిబంధనలు పాటించ డం లేదు. భూమిని లేఅవు ట్లుగా మార్పు చేసినట్టు రెవె న్యూ అధికారు ల నుంచి అ నుమతి పొందాలి, ఆ తర్వా త పంచాయతీ అనుమతి పొందాలి. లేఅవుట్ల లో రహదారులు, డీటీసీపీ అనుమతి, విద్యు త్ సౌక ర్యం, తాగునీరు, మౌలిక వసతుల కోసం కొంత మేర స్థలం కేటాయించాల్సి ఉంది.
ఇవేమీ లేకుండానే పనులు కానిస్తున్నారు. రూ.లక్షలతో వ్యవసాయ భూముల ను కొనుగోలు చేసి అను మతులు లేకుండా లేఅవుట్లు వేసి రూ.కోట్ల విలువ చేసే భూ మిగా మారుస్తున్నారు. భూమి ని కొనుగో లు చేసిన వెంటనే ప్రైవేట్ సర్వేయ ర్లతో కు మ్మక్కై భూములను లే అవుట్లుగా మారుస్తున్నారు. వాటిని విక్రయించి సొమ్ము చేసు కుంటున్నారు
కొనుగోలుదారులారా.. అప్రమత్తం...
ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్కువ ధర లు చూసి స్థలాలు కొనుగోలు చేసే ముందు ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి. వెంచ ర్కు అవసరమైన అనుమతులు ఉన్నాయా? లేఅవుట్ ఆమోదం పొందిందా? స్థలానికి సంబంధించిన హక్కు పత్రాలు సక్రమంగా ఉన్నాయా? అన్న విషయాలను పరిశీలించాలి. సంబంధిత అధికారుల ద్వారా వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
జిల్లాలో అక్రమ లేఅవుట్లు ఉన్నాయన్న ఆరోపణలపై సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు నిర్వహిస్తున్నట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని లేఅవుట్లపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.