సోయాకు మద్దతు మించి ధర

12-10-2026 | 05:25am
  1. క్వింటాలుకు రూ.6,800
  2. దిగుబడులు తగ్గడమే ప్రధాన కారణం 

నిర్మల్ అక్టోబర్ 11 ( విజయ క్రాంతి)ఖరీఫ్ సీజన్లో సోయపంటలు సాగు(Soybean Cultivation) చేసిన రైతులకు ఈ సీజన్లో మద్దతుకు మించి ధర లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం(Central Government) సోయకు మద్దతు ధర రూ. 57 05 ప్రకటించక ప్రస్తుతం మార్కెట్లో రూ.6900 ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడేళ్ల చరిత్రలో సోయపంట ఈ స్థాయిలో మద్దతు ధర లభించడం ఇదే మొదటి సారి అని రైతులు చెప్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎలినో పరిస్థితులు వాతావరణంలో వచ్చిన మార్పులు సోయపంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో సోది పంటకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడినట్టు చెప్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1.20 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలోని కుంటాల, కుబీర్, ముధోల్, లోకేశ్వరం, సారంగాపూర్, నర్సాపూర్, బాసర్, తానూరు దస్తురాబాద్ తానూర్,

భైంసా సారంగాపూర్ తదితర మండలాల్లో పత్తి తర్వాత సోయపంటని అధికంగా సాగుచేశారు. గత ఏడాది అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సోయా పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయినప్పటికీ మార్కెట్లో 4500 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. విత్తనాలు ఎరువులు పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో గత ఏడాది తీవ్రంగా నష్టపోవడంతో ఈసారి రైతులు పత్తి పంటపై ఆసక్తి చూపి విస్తీర్ణాన్ని పెంచుకున్నారు.

ప్రస్తుతం జూన్ జూలై మాసంలో కురిసిన వర్షాలకు రైతులు సోయా విత్తనాలు వేసుకోగా వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో మురుగ శాతం దెబ్బతింది. కుబీర్ బైంసా లోకేశ్వరం కుంటల దగ్గర మండలాల్లో నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు సోయపంటకు నీటి తడులు పెట్టి ఎరువులు వేసి సస్యరక్షణ చర్యలు చేపట్టారు. 

మద్దతు ధరకంటే వెయ్యి  రూపాయలు అదనం 

నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు సాగుచేసిన సోయ పంటకు ఈ సీజన్లో మద్దతు ధర కంటే అదనంగా వెయ్యి రూపాయలు ప్రైవేట్ లోని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సోయపంటకు క్వింటాలకు రూ 57 0 8 మద్దతు ధర ప్రకటించగా బైంసా కుబీర్ సారంగాపూర్ మార్కెట్ పరిధిలో సోయపంట క్వింటాలకు శుక్రవారం 6900 వరకు కొనుగోలు చేశారు.

ప్రైవేటు వ్యాపారుల సైతం 6500 వరకు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు తెలిపారు. సరిగ్గా ఏడేళ్ల క్రితం సోయా పంటకు 7500 వరకు ధర పలకగా ఏడేళ్ల తర్వాత ధరలు తగ్గగా 4200 వరకు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఈసారి కూడా తక్కువ ధర ఉంటుందని రైతులు భావించగా అనూహ్యంగా సోయకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడి 6900 వరకు కొనుగోలు చేయడం తో రైతులకు కొంత సంతోషం కలుగుతుంది.

అయితే ఈసారి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సోయా దిగుబడులు గణనీయంగా తగ్గినట్టు చెప్తున్నారు. గతంలో ఎకరానికి ఎనిమిది నుంచి పది గంటల దిగుబడి వచ్చే సోయపంట ప్రస్తుతం ఐదు నుంచి ఏడుకొండలు మాత్రమే వస్తుందని రైతులు తెలిపారు. సోయకు డిమాండ్ ఏర్పడడంతో గ్రామీణ ప్రాంతాల్లో దళారులు వచ్చి నేరుగా కొనుగోలు చేస్తున్నారు.

గతంలో దళారులు చెప్పిన ధరకే రైతులు విక్రయించుకోవలసిన పరిస్థితి నెలకొనడంతో రైతులకు నష్టం జరిగేది. కానీ ప్రభుత్వం మద్దతు ధర కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువగా మార్కెట్లో ధర పలకడంతో దిగుబడి తగ్గిన ధర కలిసి రావడంతో రైతులకు కొంత ఊరట లభిస్తుంది. 

సోయా ఉత్పత్తులు పెరుగడమే కారణం 

సోయా పంట ద్వారా వివిధ ఆహార ఉత్పత్తులను చేస్తున్న నేపథ్యంలో సో యకు డిమాండ్ ఏర్పడినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. సోయ ఆధారంగా సోయ నూనెతో పాటు, పాలు పాలతో ఉత్పత్తి చేసే వెన్ని బేకరీ వస్తువులను, తయారు చేసేందుకు సోయాలను ఎక్కువగా వినియోగిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సోయపంటను వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు.

ముఖ్యంగా సోయా పంటలు ఎక్కువగా పండించి మహారాష్ట్ర రాష్ట్రంలో తీవ్ర కడుపు రావడం సోయా పంట ఎండిపోవడం అక్కడ కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసింది. దీంతో సోయా పంటకు తెలంగాణలో మంచి డిమాండ్ ఏర్పడడంతో మహారాష్ట్ర తెలంగాణ బడా వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నట్టు చెప్తున్నారు.

ఇతర రాష్ట్రాలకు కూడా సోయపంటను బడా వ్యాపారులు తరలిస్తూ ఉన్నారు. దీంతో మార్కెట్లో సో యపంట ధర రోజురోజుకు పెరగడం రైతులకు కొంత ఇచ్చి అంశం.

మరిన్ని వార్తలు