ధర్మారెడ్డి గ్రామంలో జల ఆర్పన్ దివాస్ కార్యక్రమాలు
నాగిరెడ్డిపేట,అక్టోబర్ 2 (విజయ క్రాంతి):మండలంలోని ధర్మరెడ్డి గ్రామంలోసర్పంచ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జల అర్పన్ దివాస్(Jal Arpan Divas) కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.నేషనల్ జలజీవన్ మిషిన్(Jal Jeevan Mission ) జల అర్పణ దివాస్ మరియు హర్ ఘర్ జల్ గురించి తెలియచేస్తూ గ్రామంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి వ్యక్తిగత కులాయి కలెక్షన్ ద్వారా సురక్షితమైన మరియు తాగునీటి అందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పధకం విబి-జిఆర్ఏఎంజి గ్రామ సభ నిర్వహించి సమావేశంలో గ్రామ అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.
అనంతరం మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నిర్వహించరు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో గంగాధర్,RWS ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజ్ కుమార్,పంచాయతీ కార్యదర్శి రమేష్,ఉప సర్పంచ్ జయరాజ్,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.