కళ్యాణి గ్రామంలో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమం

17-10-2026 | 11:12pm

ఎల్లారెడ్డి, అక్టోబర్ 17:(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలోని శివాలయం వద్ద శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో(Durga Devi Sharanavaratri Festival) భాగంగా శనివారం అమ్మవారికి మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో(devotional) నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం చేపట్టారు. కళ్యాణి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డిఓ ప్రభాకర్, నాయబ్ తహసీల్దార్ లు లు పాల్గొన్నారు.గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమ నిర్వహణలో స్వాములు గురుప్రసాద్, ప్రదీప్,  రాజు,  శ్రీకాంత్, ప్రవీణ్, అభి, శ్రావణ్ గౌడ్  తదితరులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు