కలెక్టర్ క్రీడాకిట్ల పంపిణీ

27-10-2026 | 06:08pm

నిర్మల్ అక్టోబర్ 27 ( విజయక్రాంతి): రాష్ట్రస్థాయి వూషూ క్రీడా పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra) అభినందించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో క్రీడాకారులకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. జిల్లా ఖేలో ఇండియా శిక్షణ కేంద్రం విద్యార్థులకు క్రీడా సంబంధిత కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఖేలో ఇండియా వూషూ శిక్షకులు శ్రీరాముల సాయికృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు