అధ్వానంగా ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరించాలి
ఘట్ కేసర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఘట్ కేసర్ లో ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న రైల్వే వంతెన పనుల గురించి ఇరువైపులా అధ్వానంగా ఉన్న రోడ్డు విషయమై సోమవారం జరిగిన ప్రజావాణిలో ఘట్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, సభ్యులు డిప్యూటీ కమిషనర్ వాణి(Deputy Commissioner Vani)ని కలవడం జరిగింది. వంతెనకి ఇరువైపులా ఉన్న రోడ్డు చాలా అధ్వానంగా ఉండడం తరచూ ప్రమాదాలు జరుగుతున్న ఎవరు పట్టించుకోవడంలేదని అట్టి విషయంపై చొరవ చూపాలని కోరడం జరిగింది.
చర్చించిన విషయంలో భాగంగా సమస్యపై మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ని కమిషనర్ పంపించడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను జేఏసీ వాళ్లతో చర్చించి ఒక వారం రోజుల్లో రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని, ఔటర్ రింగ్ రోడ్డు నుండి మాధవరెడ్డి ఫ్లైఓవర్ వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపులా ఉన్న బాధితులకు అర్హత కలిగి ఉన్న వారికి టిడిఆర్ లు చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు బచ్చు నగేష్ కుమార్ గుప్త, అల్లు కమలాకర్, బచ్చు ప్రమోద్ గుప్త, ఎండి సిరాజ్, రెవెన్యూ శాఖ అధికారులు ప్రజలు పాల్గొన్నారు.