చెల్పూర్ శివారులో పేకాట స్థావరంపై దాడి
27-10-2026 | 06:17pm
ఏడుగురి అరెస్టు రూ.7,690 నగదు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం
గణపురం, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): గణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెల్పూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా నేర పరిశోధన విభాగం సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడి నిర్వహించారు.పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.7,690 నగదు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం గణపురం పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.