మల్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

27-10-2026 | 06:14pm

అధ్యక్షుడిగా సభావత్ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా బద్దం శ్రీనివాస్ రెడ్డి

మల్లాపూర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రెస్ క్లబ్(Mallapur TUWJ IJU Press Club) నూతన కమిటీని మంగళవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.

నూతన కార్యవర్గం వివరాలు: మండల అధ్యక్షుడిగా సభావత్ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బద్దం రాంచందర్ రెడ్డి, కోశాధికారిగా సింగిరెడ్డి అశోక్, సంయుక్త కార్యదర్శిగా వాసం మధుకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

జర్నలిస్టులకు హెల్త్ కార్డుల మంజూరు, ఇంటి స్థలాల కేటాయింపు వంటి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఐజేయూ ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, రాష్ట్ర ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు రాగుల గోపాలచారి, జిల్లా కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు లోక రమణారెడ్డి, బాశెట్టి హరీష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు నిమిషకవి రాజేష్, గౌరవ అధ్యక్షుడు ర్యాగల్ల వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు గుగ్గిల రాజశేఖర్, మిడిదోడ్డి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు