నాగిరెడ్డిపేట్ టీఆర్ఎస్‌లో మల్లారెడ్డికి కీలక బాధ్యతలు

31-10-2026 | 04:06pm

నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట్ మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన మల్లారెడ్డిని మండల టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించినట్లు మండల అధ్యక్షుడు బాగా రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన మల్లారెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవికి నియమించేందుకు కృషి చేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాగిరెడ్డిపేట్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి (Party Strengthening) తనవంతు కృషి చేస్తానని, పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఫాయిం, మండల మహిళా అధ్యక్షురాలు పద్మ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీను, సీనియర్ నాయకుడు ప్రభాకర్ పాల్గొన్నారు

మరిన్ని వార్తలు