కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

16-10-2026 | 08:47pm

భిక్కనూర్, అక్టోబర్‌ 16 (విజయక్రాంతి): భిక్కనూర్‌ మండలం(Bhikkanur Mandal) పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన మట్టి రాజు(Matti Raju) (30) గురువారం అర్ధరాత్రి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజుకు సుమారు 18 ఏళ్ల క్రితం దోమకొండ మండలానికి చెందిన సబితతో వివాహం జరిగింది. వీరికి విక్కీ (15) అనే కుమారుడు ఉన్నాడు.

నాలుగేళ్ల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు పంచాయతీలు నిర్వహించినా భార్య తిరిగి రాకపోవడంతో రాజు మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఇంటి పక్కన ఉన్న వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ ఎస్‌.అనిల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు