తల్లిదండ్రులకు మించిన దైవం లేదు

16-10-2026 | 09:52pm

వెల్దండ అక్టోబర్ 16: తల్లిదండ్రులకు మించిన దైవం లేదని మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ చైర్మన్ పాపు శెట్టి రామ్(Foundation Chairman Papu Shetty Ram) అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వందేమాత, ఐక్యత ఫౌండేషన్, మై విలేజ్ మోడల్ విలేజ్, సహకారంతో కల్చర్ కల్చలర్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా పాద పూజా కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో వెల్దండ సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఐక్యత ఫౌండేషన్ సభ్యుడు వరప్రసాద్ రెడ్డి, మాజీ సర్పంచి అరుణ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు పాల్గొని విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రాముఖ్యత గురించి పిల్లల కోసం తల్లిదండ్రులు పడే శ్రమ గురించి వారి పట్ల చిన్నారులు చూపించాల్సిన ఆత్మీయత గురించి వివరించారు. కార్యక్రమంలో శృతి కల్చరల్ చైర్మన్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి

మరిన్ని వార్తలు