పోచారం కాలువలో పడి వ్యక్తి మృతి

22-10-2026 | 07:56pm

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): పోచారం ప్రాజెక్టు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం...నాగిరెడ్డిపేట మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం కాలువలో ప్రమాదవశాత్తు పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువలో పడి కాశబోయిన నర్సింలు (33) అనే వ్యక్తి మృతి చెందాడు. కాశబోయిన నర్సింలు గురువారం ఉదయం పొలాల నుంచి పచ్చిగడ్డి కోసుకొచ్చిన తర్వాత స్నానం చేసి వస్తానని చెప్పి, జనార్ధన్ రెడ్డి వ్యవసాయ పొలం వద్ద ఉన్న పోచారం కాలువలో స్నానం చేయడానికి వెళ్లాడు.ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి నీటిలో మునిగిపోయాడు.వెంటనే అక్కడే ఉన్న గ్రామస్థులు కాలువలో నుంచి అతడిని బయటకు తీసి చూడగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.ఈ ఘటనపై భార్య సవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.

మరిన్ని వార్తలు