విద్యుత్ ఓల్టేజ్ సమస్యను తీర్చిన ఎమ్మెల్యే

11-10-2026 | 09:55pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 11 (విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామంలో(Tandur Village) ఉన్న వోల్టేజ్ సమస్యను(Voltage Issue) గ్రామ సర్పంచ్ భూమా యాదగౌడ్ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(Madan Mohan Rao) దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.దీనికి వెంటనే వెంటనే ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించి 25 కె.వి.ఏ,డిటి ఆర్ మంజూరు చేయడం జరిగింది.

ఆదివారం తాండూరు గ్రామంలో ప్రధాన రహదారి వెంబడి ఉన్న 15 కె.వి.ఏ,డిటిఆర్ స్థానంలో ఐరన్ పోలును తీసివేసి దాని స్థానంలో తొమ్మిది మీటర్ల సిమెంట్ పోల్ ఏర్పాటు చేసి 25 కెవిఏ,డిటిఆర్ బిగించడం జరిగింది. గ్రామంలో ఉన్న సమస్యను తెలిపిన వెంటనే స్పందించి సమస్య పరిష్కారంలో భాగంగా నూతన డిటిఆర్ ఇప్పించినందుకు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు గ్రామ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి భూమా యాద గౌడ్,లైన్మెన్ అశోక్,గ్రామస్తులు ఉన్నారు

మరిన్ని వార్తలు