ప్రజావాణికి ఆరుగురు అధికారులు గైర్హాజర్....
19-10-2026 | 06:01pm
తాడ్వాయి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani)కి ఆరుగురు అధికారులు గైర్హాజరయ్యారు. ప్రజావాణికి మొత్తం 22 శాఖల అధికారులు హాజరు కావలసి ఉండగా 16 శాఖలకు చెందిన అధికారులు మాత్రమే హాజరైనట్లు ఎంపీడీవో భరత్ కుమార్ తెలిపారు. మిగతా 6 శాఖల అధికారులు గైర్హాజర్ అయినట్లు తెలిపారు. ఈరోజు నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ కు సంబంధించిన ఒక దరఖాస్తు వచ్చిందని ఆయన వివరించారు. అధికారులు బాధ్యతగా ప్రజావాణికి హాజరు కావాలని ఆయన కోరారు.