ఫలితాలపై రెండు గ్రామాల చూపు

03-10-2026 | 07:40pm

భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్‌ మండలం(Bikkanur Mandal) ఇస్సన్నపల్లి, భాగీర్తిపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్దచెరువు (Big Lake) విషయంలో గణేష్‌ నిమజ్జనం(Ganesh Immersion) నుంచి కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం కోసం అధికారులు శనివారం అన్ని శాఖల ఆధ్వర్యంలో సర్వే పనులు చేపట్టారు. చెరువు హద్దులు, విస్తీర్ణం, సంబంధిత రికార్డులను పరిశీలిస్తూ సర్వే నిర్వహిస్తున్నారు. చెరువు తమ గ్రామ పరిధిలో ఉందంటూ ఇరు గ్రామాల ప్రజల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో అధికారులు ఈ సర్వే చేపట్టారు.

సర్వే పూర్తయిన అనంతరం అధికారిక రికార్డులు, సర్వే ఫలితాల ఆధారంగా చెరువు ఏ గ్రామ పరిధిలోకి వస్తుందో స్పష్టత వస్తుందని సీఐ నరేష్‌ తెలిపారు. సమస్యలకు గొడవలు పరిష్కారం కాదని, అధికారుల సర్వే, రికార్డుల ఆధారంగానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సర్వేలో ల్యాండ్‌ సర్వే జిల్లా ఇన్‌చార్జి సుమలత, ఎంఆర్‌ఓ సునీత, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఇరిగేషన్‌ ఏఈ హరీష్‌, ఆర్‌ఐ నజీముద్దీన్‌, సీఐ నరేష్‌, ఎస్‌ఐ అనిల్‌ పాల్గొన్నారు. దీంతో ఇరు గ్రామాల ప్రజల చూపు సర్వే ఫలితాలపైనే ఉంది.

మరిన్ని వార్తలు