ఐదు రోజులుగా తాగునీటి కోసం ప్రజల అగచాట్లు..!
- బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి, హనుమాన్ గల్లీలో నీటి కటకట...
- తాగునీటి కోసం ప్రజల పాట్లు...
- పట్టించుకోని అధికారులపై స్థానికుల ఆగ్రహం...
బాన్సువాడ, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి, హనుమాన్ గల్లీలో గత ఐదు రోజులుగా తీవ్ర తాగునీటి సమస్య(Drinking water problem) నెలకొనడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ అవసరాలకు సరిపడా నీరు అందకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి సరఫరా(Drinking water supply) నిలిచిపోవడం,సక్రమంగా అందకపోవడంతో తాగునీటితో పాటు ఇతర గృహ అవసరాలకు నీరు దొరకని పరిస్థితి నెలకొందని ప్రజలు చెబుతున్నారు. ఐదు రోజులుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించి పరిష్కార చర్యలు చేపట్టడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, సమస్య పరిష్కారంలో జాప్యం ఎందుకు జరుగుతోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు(Municipal officials) స్పందించి కోటగల్లి, హనుమాన్ గల్లీలో తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని, నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.