కవిత పార్టీలో భారీగా చేరికలు
గంభీరావుపేట, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి ): టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు(TRS Party Ideologies), కవితక్క నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆకర్షితులవుతూ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) అధ్యక్షురాలు సంకెపెల్లి సుమలత శర్మ(Sankepelli Sumalatha Sharma), సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్ తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గోరంటాల గ్రామంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ యువజన నాయకుడు సయ్యద్ జావిద్, గ్రామ శాఖ నాయకుడు బందెల రాజు ఆధ్వర్యంలో పలువురు యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సుమలత శర్మ, ఇన్‌చార్జ్ మజీద్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవితక్క పార్టీ ఆవిర్భావమై నాలుగు నెలలు గడవకముందే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం గమనార్హమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కవితక్క చేస్తున్న ఉద్యమాలకు విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. కవితక్కను ముఖ్యమంత్రిగా చూడడం తమ లక్ష్యమని కొత్తగా చేరిన నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో గంభీరావుపేట నాయకులు కూర సురేష్, సంకెపెల్లి సుధాకర్ శర్మ, ముస్తాబాద్ మండల నాయకుడు మార్వాడి దేవరాజు, బైరి రాజేష్, కొర్రి రమేష్, సిద్ధూ, చరణ్, సతీష్, నియోజకవర్గ మహిళా నాయకురాలు కదిరే రేణుక, ఆకారం పుష్పలత, ముత్తవ్వ, పద్మ తదితరులు పాల్గొన్నారు.