అరుదైన వ్యాధికి శస్త్ర చికిత్స విజయవంతం...

04-10-2026 | 07:56pm

కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు...

బాన్సువాడ, అక్టోబర్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఆదివారం ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధిగా పేర్కొంటున్న మెరీనా రోమాతో బాధపడుతున్న బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మహిళకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. మహిళ నోటిలోని దవడ ప్రాంతంలో ఏర్పడిన మెరీనా రోమా గడ్డను డాక్టర్ సాయికృష్ణ ఆధ్వర్యంలోని వైద్య బృందం శస్త్రచికిత్స చేసి తొలగించింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆసుపత్రి వైద్య బృందాన్ని పలువురు అభినందించారు. బాన్సువాడలోనే అరుదైన కేసుకు చికిత్స అందించి విజయవంతం చేయడం విశేషమని స్థానికులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు