JVR ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాలకు సన్నాహాలు
సత్తుపల్లి. అక్టోబర్ 4. ( విజయ క్రాంతి ) : సత్తుపల్లి పట్టణంలోని JVR ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ సంబరాలను(Golden Jubilee Celebrations of JVR Government Degree College) త్వరలో ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్(Matta Dayanand Vijay Kumar) తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1976–2026 సంవత్సరాలను పురస్కరించుకుని నిర్వహించనున్న స్వర్ణోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది(Alumni, faculty, and staff) సమన్వయంతో ముందుకు రావాలని కోరారు.
ఈ నెల 18న నిర్వహించనున్న ముఖ్య సమావేశానికి 1976 నుంచి 2026 వరకు కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సకాలంలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సత్తుపల్లి పట్టణంలోని J కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో చీకటి రామచంద్రరావు మనుమరాలి మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
అదేవిధంగా సత్తుపల్లి పట్టణం కల్పతరువు రోడ్డుకు చెందిన, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ డ్రైవర్ వంగల ప్రకాష్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.