బీసీల లెక్క తేలాల్సిందే!
హైదరాబాద్: ఓబీసీ కులాల జనగణన చేపట్టాలనే డిమాండ్‌తో శంషాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్, ఎమ్మెల్యే శంకర్(MLA Veerlapally Shankar) ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీసీ జనాభా ఆధారంగా హక్కులు, సంక్షేమ పథకాలు కల్పించాలని సభలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ.. తెలంగాణలో లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో కులగణన నిర్వహించామని తెలిపారు. కులగణన, బీసీల హక్కుల కోసం పోరాటాన్ని గ్రామస్థాయి నుంచి ప్రారంభించాలని పిలుపునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్ల అంశంలో ఎదురవుతున్న అడ్డంకులపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అన్నారు. బీసీల డిమాండ్ల సాధన కోసం రెండు దశల్లో కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు.