బతుకమ్మ కుంట వద్ద గంజాయి సరఫరా ముఠా భరతం

04-10-2026 | 08:52pm

జనగామ, అక్టోబర్ 04 (విజయక్రాంతి): జనగామ పట్టణ సిఐ సత్యనారాయణ రెడ్డి(CI Satyanarayana Reddy) ఆదేశాల మేరకు ఎస్సై ఎం. భరత్, సిబ్బంది బతుకమ్మ కుంట చౌరస్తా సూర్యాపేట రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 245 గ్రాముల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు కుందారం గ్రామానికి చెందిన ఇట్టబోయిన ఉదయ్ కుమార్, నందనబోయిన సందీప్, పెద్దమడూరుకు చెందిన పోతుగంటి సుధీర్, హైదరాబాద్ కు చెందిన పంజాల శివకుమార్, శామీర్పేటకు చెందిన తాండ్ర అభిషేక్ గా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి కారాగారానికి తరలించినట్లు పట్టణ తనిఖీదారు సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు