శబరిమాత ఉత్సవాల్లో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి!

23-10-2026 | 07:02pm

మాల్తుమ్మెదలో 37వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు

నాగిరెడ్డిపేట,అక్టోబర్ 23 (విజయ క్రాంతి):మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పరమహంస సచ్చిదానంద శ్రీ శబరిమాత 37వ వార్షికోత్సవంలో(Sabari Mata celebrations) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి,ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శబరిమాత అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించిన అనంతరం పాదుకా పూజ మహోత్సవం నిర్వహించి,భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో నాయకులు కర్రే సాయిలు, రాకేష్, వెంకటరెడ్డి, దుర్గయ్య, సంగమేశ్వర్, చెన్నంగారి శ్రీనివాస్ రెడ్డి, పరందాములు, జైపాల్ రెడ్డి, సంతోష్ పాటిల్, ఆఫీస్ పటేల్, ధనవత్ రాజు, నీల రవి, తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు