రైతు గర్జనకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ సర్పంచులు

01-11-2026 | 04:53pm

నాగిరెడ్డిపేట, నవంబర్ 01 (విజయక్రాంతి): చలో అదిలాబాద్ రైతు గర్జన సమావేశానికి ఆదివారం నాగిరెడ్డిపేట(Nagireddypeta) మండల సర్పంచ్లు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచి రైతుబంధు రైతు బీమా సమయానికి కరెంటు ఇవ్వగా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని వారు అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కేవలం కాంగ్రెస్ తెచ్చిన కరువు అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, మహేందర్, బాల్య నాయక్, నాయకులు గుల్లపల్లి నారాయణ, సాయిలు, పేరుపల్లి మహేందర్ తదితరులు తరలివెళ్లారు.

మరిన్ని వార్తలు