పలు గ్రామాల్లో ఆరోగ్య ప్రత్యేక శిబిరాలు
► వాతావరణ మార్పులతో వ్యాధులపై అప్రమత్తత అవసరం
► బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు
► అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. గురువారం మండలంలోని నాగిరెడ్డిపేట, మెల్లకుంట తండా గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం(Primary Health Medical Center) ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వైద్యుల సూచన మేరకు అవసరమైన మందులను అందజేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సర్పంచ్లు మన్నె వెంకట్,బాల్య నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మన్నె వెంకటి,బాల్య నాయక్,ఆరోగ్య వైద్య సిబ్బంది,వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.