నర్సింగ్ అడ్మిషన్స్‌కు ఇదే ఛాన్స్!
బాన్సువాడ, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు ప్రవేశాల కోసం కన్వీనర్ కోటా కింద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (ONLINE REGISTRATION)ను పునఃప్రారంభిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బాన్సువాడ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రణుతి తెలిపారు.టీజీ ఈఏపీసీఈటీ–2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లకు ప్రవేశాల కోసం ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
https://tsparamed.tsche.in ఆన్‌లైన్ వెబ్‌సైట్ (ONLINE WEBSITE)లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.2,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాంక్ లావాదేవీల ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాలకు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ ప్రణుతి తెలిపారు.