17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ఆర్డీవోకు వినతి

10-09-2026 | 04:53pm

బాన్సువాడ,(విజయ క్రాంతి): ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day), “తెలంగాణ సప్త సంకల్పాలు” అమలు చేయుటకు బిజెపి నాయకులు గురువారం బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి(Banswada RDO Ravinder Reddy)కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ... 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరువలేని మహోన్నతమైన రోజు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల(Razakar) దురాగతాలు, జమీందారీ–జాగీర్దారీ దోపిడీ నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక సందర్భానికి ఆ రోజు ప్రతీక. ఈ విమోచన కోసం అనేకమంది రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజలు పోరాడి ప్రాణత్యాగాలు చేశారు. భారత ఐక్యత కోసం ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చూపిన రాజకీయ సంకల్పం, భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పోలో ఈ చారిత్రక పరిణామంలో కీలక పాత్ర పోషించాయి.ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను “తెలంగాణ విమోచన దినోత్సవం”గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలనీ వారు కోరారు. 

మరిన్ని వార్తలు