అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

24-10-2026 | 08:33pm

జిల్లా ఇన్‌చార్జి డీడబ్ల్యూఓ హేమా భార్గవి

శివంపేట అక్టోబర్ 24(విజయక్రాంతి ) : మెదక్ జిల్లా(Medak District) ఇన్‌చార్జి డీడబ్ల్యూఓ  హేమా భార్గవి శివంపేట మండలంలోని ఎదులాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని(Edulapur Anganwadi Centre) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో(Anganwadi Centre) పిల్లల హాజరు, పౌష్టికాహార పంపిణీ(Distribution of nutritious food), కేంద్రం పరిశుభ్రత, ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాలు, అంగన్వాడీ సేవల అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు.

అంగన్వాడీ సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజూ నిర్ణీత మెనూ ప్రకారం ఆహారం తయారు చేయాలని, లబ్ధిదారుల హాజరును క్రమం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంగన్వాడీ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పౌష్టికాహార సేవలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రతను పాటిస్తూ ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సేవలను నాణ్యతతో అందించి, అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు.

మరిన్ని వార్తలు