అడవి పందుల దాడిలో మొక్కజొన్న ధ్వంసం
21-09-2026 | 07:28pm
రూ.20 వేల ఆస్తి నష్టం...
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి అడవి పందుల(Wild boars) దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. గ్రామానికి చెందిన బూరుగుల లింగారావు మొక్కజొన్న పంట(corn crop)పై అడవి పందులు దాడి చేసి ధ్వంసమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దాడిలో రూ. 20 వేల ఆస్తి నష్టం జరిగినట్లు వారు తెలిపారు. అధికారులు స్పందించి బాదిత రైతుకు ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.