నిలిచిపోయిన వాటర్ ట్యాంకుల పనులను ప్రారంభించాలి..

21-09-2026 | 05:57pm

బిజెపి పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి డిమాండ్..

బాన్సువాడ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలో నిర్మాణంలో నిలిచిపోయిన వాటర్ ట్యాంకులను సోమవారం బిజెపి నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాన్సువాడ పట్టణానికి తాగునీటి సౌకర్యార్థం అమృత్.2.0 పథకం క్రింద 52 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. 

మంజూరు చేసి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు పనులు పూర్తికాలేవనీ, పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించి నిర్మాణ పనులను నిలిపివేసిన సంబంధిత గుత్తా దారుడి పై చర్యలు తీసుకోవాలని, లేని యెడల బాన్సువాడ ప్రజల తరఫున బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు